ఎన్టీఆర్‌పై శ్రీలీల తల్లి కామెంట్స్.. వైరల్

స్టార్ హీరో ఎన్టీఆర్‌పై నటి శ్రీలీల తల్లి, డాక్టర్ స్వర్ణలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలీల డ్యాన్స్ నేర్పించేందుకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని ఓ టాక్ షోలో ఆమె తెలిపారు. బాల్యంలో ఎన్టీఆర్ కూచిపూడి నృత్య ప్రదర్శన చూసి.. శ్రీలీలకు డ్యాన్స్ నేర్పించానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.