VIDEO: హనుమాన్ స్వాముల కొండగట్టు పాదయాత్ర
KMR: గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన 150 మంది హనుమాన్ మాలాధారులు కొండగట్టుకు పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి చిన్నపిల్లలు, వృద్ధులు సైతం మండుటెండను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. అరికాళ్లు కాలుతున్నా మొక్కులు తీర్చుకోవాలనే భక్తి వారికి బలంగా నిలుస్తోంది.