మోతె గ్రామంలో 'ఇంటింటికీ బడిబాట' కార్యక్రమం
NZB: వేల్పూర్ మండలం మోతె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్లు ఆదివారం 'ఇంటింటికీ బడిబాట' కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాలు, నాణ్యమైన విద్యాబోధన గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మోతె సర్పంచ్ రమేశ్, గ్రామ ప్రజలు ఉన్నారు.