VIDEO: నిర్మల్‌కు చేరుకున్న సాధువులు

VIDEO: నిర్మల్‌కు చేరుకున్న సాధువులు

NRML: ఉత్తర భారతదేశానికి చెందిన 300 మంది సాధువులు గోదావరి ప్రదక్షిణ కోసం మంగళవారం నిర్మల్ చేరుకున్నారు. స్థానిక భక్తులు వారికి ఘన స్వాగతం పలికారు. నాసిక్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర బాసర, కాలేశ్వరం, భద్రాచలం మార్గంగా కొనసాగి, రాజమండ్రి సమీపంలోని అంతర్వేదిలో సముద్రంలో విలీనమవుతుంది. మొత్తం 15 రోజులపాటు జరిగే ఈ పాదయాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.