అన్నారం షరీఫ్‌లో తైబజార్ వేలం రద్దు
WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో తైబజార్ వేలంపాటను శుక్రవారం అధికారులు రద్దు చేశారు. గత వేలంలో ప్రభుత్వ ఉద్యోగికి కాంటాక్ట్ దక్కినట్లు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న కొత్తగా వేలంపాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ మహేందర్, కార్యదర్శి మోహినుద్దీన్ తెలిపారు.