తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ పార్టీ నుంచి మాజీ మంత్రి కేఏ సెంగొట్టయన్ సస్పెండ్ చేసినట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండైన పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్‌లతో చేతులు కలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆయన పదే పదే పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.