జనాభా గణన శిక్షణ శిబిరానికి హాజరైన కలెక్టర్
BDK: పినపాక మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన జనాభా గణన శిక్షణ శిబిరానికి ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సెన్సెక్స్ స్టేట్ డైరెక్టర్ ఎస్ఆర్ జ్ఞాన్ శంకర్, 2027లో జరగబోయే ఇళ్ల గణన వివరాలను సూపర్వైజర్లకు వారు వివరించారు. వారితోపాటు డైరెక్టర్ సుబ్బరాజు, తహసీల్దార్ గోపాలకృష్ణ ఉన్నారు.