'నామినేషన్ దరఖాస్తులు క్షుణ్నంగా పరిశీలించాలి'
NRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందించే నామినేషన్ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి స్వీకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం ఆమె నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా నామినేషన్ల వివరాలను రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.