కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమావేశం
KRNL: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం కోసం దిశ కమిటీ కీలకంగా పని చేస్తుందన్నారు. అవసరమైతే ఈ కమిటీ అభివృద్ధి పనులను పర్యవేక్షించే అవకాశం ఉందన్నారు. ZP ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు.