ఈనెల 27, 28 తేదీల్లో కవిత 'జనం బాట'
KMR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఈ నెల 27, 28 తేదీలలో కామారెడ్డి జిల్లాలో ‘జనం బాట’ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ నిన్న సాయంత్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 27న నిజాంసాగర్ మండలం నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.