మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: AITUC

MHBD: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకుల కోరారు. ఈ సందర్భంగా గురువారం నూతన మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మున్సిపల్ కార్మికుల సమస్యలను క్లుప్తంగా వివరించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రేషపల్లి నవీన్, వెలుగు శ్రావణ్, జ్ఞానేశ్వర్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.