కామారెడ్డిలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కామారెడ్డిలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

KMR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన ఎస్పీని రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను SP రాజేష్ చంద్ర గురువారం మీడియాకు వివరించారు. ఈ ఏడాది మొదటి 7 నెలల కాలంలో 41 రోడ్డు ప్రమాదాలు, 44 మరణాల తగ్గుదల నమోదైందని SP తెలిపారు. ఇది జిల్లాలో రహదారి భద్రతలో శుభసూచకమైన పురోగతి అని పేర్కొన్నారు.