అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
KMR: బిక్నూరు మండలం అంతంపల్లి గ్రామంలో "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"లో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పనుల పురోగతిని సమీక్షించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామస్తులు,ప్రజాప్రతినిధులు మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు