రావి ఆకుపై అందెశ్రీ చిత్రంతో నివాళి
SRD: నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ మంగళవారం రావి ఆకుపై దివంగత ప్రముఖ కవి రచయిత అందెశ్రీ చిత్రాన్ని గీసి ఆవిష్కరించారు. తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయిందని, ఉద్యమానికి ఊపిరి పోసిన గొంతు, చిరస్థాయిలో నిలిచిందని ఆర్టిస్ట్ శివ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు ఆకుపై చిత్రంతో శ్రద్ధాంజలి ఘటించారు.