'ప్రతీ కార్యకర్త పార్టీపై అవగాహన పెంపొందించుకోవాలి'
MNCL: చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల BJP శిక్షణా తరగతులను జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త నిర్మాణం కోసం జరిగే శిక్షణను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పార్టీ చరిత్ర, వికాసం, సిద్ధాంతం, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ మేరకు ప్రతీ కార్యకర్త పార్టీపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన కోరారు.