'మిషన్ భగీరథ అధికారులు నాలాల సర్వే నిర్వహణ'
VKB: అంగడిరాయిచూర్ జీపీ పరిధిలోని ధర్మపూర్‌లో మిషన్ భగీరథ అధికారులు సోమవారం నాలాల సర్వే నిర్వహించి, ఇంటి సంఖ్య ఆధారంగా నాలా నంబర్లను కేటాయించారు. ఇది ప్రాథమిక సర్వే మాత్రమే అని అధికారులు తెలిపారు. పరిమితికి మించి నాలాలు ఉంటే జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నాలా పనితీరుపై సమస్యలు ఉంటే వివరించాలని కోరారు.