VIDEO: కంభంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
ప్రకాశం: కంభంలోని RCM చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలని సిలువపై యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలు ప్రపంచానికి ఆదర్శమని కంభం చర్చ్ పాస్టర్ తెలిపారు. అనంతరం చర్చి నుంచి కందులాపురం వరకు క్రైస్తవులు పాల్గొని సిలువ మార్గయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.