అయోధ్య కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి సీతక్క

BDK: మణుగూరు మండలం రామానుజవరంలో ఇటీవల మృతి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య చిత్రపటానికి మంత్రి సీతక్క శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అయోధ్య చారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.