నంద్యాలలో పాఠశాలలకు సెలవులు

నంద్యాలలో పాఠశాలలకు సెలవులు

NDL: ‘మొంథా’ తుఫాను తీవ్ర ప్రభావం కారణంగా నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈరోజు, రేపు (28, 29) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. పలుచోట్ల పాఠశాల భవనాలు దెబ్బతినడం, పైకప్పులు పడిపోయే ప్రమాదం ఉండడంతో జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు డీఈవో జనార్దన్ రెడ్డి ఎంఈఓలకు సర్కులర్ జారీ చేశారు.