సాయుధ బలగాలకు మాబ్ ఆపరేషన్ విధులపై శిక్షణ

సాయుధ బలగాలకు మాబ్ ఆపరేషన్ విధులపై శిక్షణ

PPM: జిల్లాలో ప్రజా శాంతి భద్రత పరిరక్షణలో బాగంగా సాయుధ బలగాలకు శుక్రవారం మాబ్ ఆపరేషన్ విధులపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. సభలలో, VIP పర్యటనలో ప్రజలు పెద్దఎత్తున గుమిగుడే పరిస్థితులలో ఎలా వ్యవహరించాలి, అల్లర్లకు పాల్పడకుండా నియంత్రించాల్సిన మెళుకువలను సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్.డిఎస్పీ థామస్ రెడ్డి, ఏ.ఆర్.ఆర్ఐ పాల్గొన్నారు.