'రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి'

PDPL: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహార చెక్కులను పంపిణీ చేశారు.