రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

MNCL: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేనేజర్ టి. శ్రీనివాసులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. డిపో పరిధిలో బస్సుల సమయాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రజలు 9959226004 నంబర్‌ కు కాల్ చేసి అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను తెలపాలని సూచించారు.