'పారిశుధ్యంపై అలసత్వం అసలు సహించం'
విశాఖ నగరంలోని అన్ని వార్డులు, కాలనీలు, వీధుల్లో పారిశుధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రాథమిక పౌర సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.