పశువులను తరలిస్తున్న వ్యాన్లు పట్టివేత

SKLM: అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు ఐసర్ వ్యాన్లను పట్టుకున్నట్టు లావేరు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సుభద్రాపురం కూడలి వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం వైపు వెళ్తున్న రెండు ఐసర్ వ్యాన్లు ఆపి పరిశీలించారు. ఇందులో 28 పశువులను (గేదెలను) ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించారు.