కురవి వీరభద్రస్వామి సన్నిధిలో మాజీ మంత్రి

కురవి వీరభద్రస్వామి సన్నిధిలో మాజీ మంత్రి

MHBD: కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసారు. నేడు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయ ఆవరణలో ఒత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, స్థానిక భక్తులు, తదితరులున్నారు.