కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: టీపీసీసీ సభ్యులు
BDK: చండ్రుగొండ తుంగారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు నేడుపాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోత్ బొజ్జ నాయక్, తుంగారం ఎక్స్ ఎంపీపీ పార్వతి పాల్గొన్నారు.