చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు మృతి
VZM: గజపతినగరం మండలం కొత్తబగ్గం గ్రామంలో విషాదం నెలకొంది. తులసి కోట వద్ద ప్రదక్షిణలు చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని బగ్గం శ్యామల (75) అనే వృద్ధురాలు మృతి చెందింది. జనవరి 25న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.