గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే
W.G: భీమవరం మండలంలోని అనాకోడేరు, వెంప గ్రామాల్లో మొత్తం రూ. 5.69 కోట్లతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) శంకుస్థాపన చేశారు. గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడమే లక్ష్యమని తెలిపారు. అన్ని గ్రామాల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.