రోడ్డు ప్రమాదంలో కదిరి రూరల్ CIకి స్వల్ప గాయాలు
సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో కదిరి రూరల్ CI నాగేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఐకి స్వల్ప గాయాలు కాగా, కారులోని కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వెల్దుర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.