SEC రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడద

SEC రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడద

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ఎంట్రన్స్, ఫ్లాట్ ఫారాలపై కుక్కల బెడద ఎక్కువైందని ప్రయాణికులు మంగళవారం తెలిపారు. అటు గ్రేటర్ నగరంలో కుక్కల బెడద ఉందనుకుంటే, రైల్వే స్టేషన్ వద్ద సైతం ఉండటం ఏంటని ప్రశ్నించారు. అవి జనాలపై దాడి చేసే ఆస్కారం ఉందని తెలిపారు. రైల్వే అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.