నరసరావుపేటలో ఘనంగా హోంగార్డుల దినోత్సవం

నరసరావుపేటలో ఘనంగా హోంగార్డుల దినోత్సవం

PLD: నరసరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో హోంగార్డుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ కృష్ణారావు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. హోంగార్డు ఉద్యోగం చిన్నది కాదని, ప్రజల రక్షణ కోసం ఎంతో బాధ్యతతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.