కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: కురుపాంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. మహిళలకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందగలిగితే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబాలను చక్కదిద్దుకోవచ్చని అన్నారు.