పంది మాంసం దుకాణం సీజ్

ఖమ్మం కొత్త బస్టాండ్ పక్కన వెజ్, ఫిష్ మార్కెట్‌లో ఎలాంటి అనుమతి లేకుండా పంది మాంసం షాప్ ఏర్పాటుచేయడంపై కేఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు దుకాణాన్ని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకుడికి రూ.3వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ ఎం.సాంబయ్య, శానిటరీ ఇన్స్‌పెక్టర్ మల్లయ్య, జవాన్ పాల్గొన్నారు.