గతంలో TGతో సమానంగా ఉండేవాళ్లం: చంద్రబాబు
AP: వివిధ శాఖల పనితీరుపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 'గత 2 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించాం. 17.11 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాం. GSDP సాధనలో ప్రణాళిక అత్యంత కీలకం. గతంలో TGతో సమానంగా ఉండేవాళ్లం. గత ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాలతో.. ఏపీ దక్షిణ భారతదేశంలో చివరి స్థానానికి చేరింది' అని పేర్కొన్నారు.