ఈ నెల 8 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

BPT: పర్చూరు మండలం ఉప్పుటూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భజన కచేరీలు, గరుడ సేవ, ఏకాంత సేవ, గ్రామోత్సవాలు, దొంగల దోపు సేవ, వసంతోత్సవం, స్వామి వారి కళ్యాణం మొదలైన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కార్యనిర్వహణాధికారి దామ నాగేశ్వరరావు తెలిపారు.