KGBVలో ప్రవేశాలకు దరఖాస్తులు

ప్రకాశం: జరుగుమల్లి మండలంలోని కె.బిట్రగుంట కేజీబీవీ పాఠశాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్రవంతి తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 11వ తేదీలోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.