గొల్లగూడెం లో బస్తీబాట కార్యక్రమం
SRD: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం గొల్లగూడెంలో బస్తి బాటా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అధికారులు ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల వోల్టేజి సమస్య వస్తుందని స్థానికులు అధికారులకు వివరించారు. విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని ఏఈ స్వామి తెలిపారు.