పోలీస్ కార్యాలయంలో మౌలాల అబుల్ కలాం జయంతి వేడుకలు
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హాజరై, ముందుగా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్ర అనంతరం అబుల్ కలాం ఆజాద్ దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని తెలిపారు.