'పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి'
JN: పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈరోజు ఘనపూర్ మండల పరిధిలోని ZPSS, ఛాగల్ గ్రామంలోని ZPSS పాఠశాలలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, ఇతర మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి వాటి గురించి ఆరా తీశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.