GGHలో పారిశుద్ధ్యంపై కార్పొరేషన్ హెల్త్ అధికారి పర్యవేక్షణ

NLR: ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌లో పారిశుద్ధ్య పనులను కార్పొరేషన్ హెల్త్ అధికారి కనకాద్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కుక్కలు, పందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా GGH కమిటీ ఛైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, హాస్పటల్ సూపరింటెండెంట్ మాధవి, హెచ్డితో ఆయన చర్చించారు.