ఉత్తమ ఉపాధ్యాయునికి గ్రామస్తుల సన్మానం

SRCL: చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం కృష్ణారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్నందుకు గానూ, గ్రామస్తులు మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్తయ్య, ఏఏపీసీ ఛైర్మెన్, విద్యార్థుల తల్లి దండ్రులు, తదితరులు పాల్గొన్నారు.