రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ టీచర్ మృతి

రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ టీచర్ మృతి

GNTR: పొన్నూరు GBC రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళా ఉపాధ్యాయురాలు మృతి చెందారు. బాపట్లకు చెందిన పఠాన్ హమీద్ నిషాఖాన్ (40) పొన్నూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నారు. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఆమె స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.