డయల్ యువర్ APEPDCL సీఎండీకి ఫిర్యాదులు
VSP: APEPDCL సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందినట్లు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. విద్యుత్ సరఫరా లో-వోల్టేజ్, వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ మార్పు, రూఫ్‌టాప్ సోలార్, బిల్లులు, వైర్లు వేలాడటం వంటి సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.