'ఇరాన్ అణు సామర్థ్యం ఖతం'.. నెతన్యాహు
తమ దాడులతో ఇరాన్ కోలుకోలేని దెబ్బతిన్నదని ఇజ్రాయెల్ PM నెతన్యాహు ప్రకటించారు. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం ఆ దేశానికి ఇక లేదని స్పష్టం చేశారు. అణుముప్పును తొలగించడం, సైనిక శక్తిని అణచివేయడం, ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛనివ్వడమే తమ లక్ష్యాలని తెలిపారు. క్షిపణి ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, ఈ యుద్ధంలో ఇరాన్ సర్వనాశనం కావడం ఖాయమని వెల్లడించారు.