పాల వ్యాన్, లారీ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KMM: ఎర్రుపాలెం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద సోమవారం ఉదయం పాల వ్యాన్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాల వ్యాన్ డ్రైవర్‌కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.