కాటా భాస్కర్ రెడ్డిని కలిసిన కావలి ఎమ్మెల్యే

NLR: సోమవారం కావలిలో పీఎసీఎఎస్ ఛైర్మన్‌గా నియమితులైన కాటా భాస్కర్ రెడ్డిని, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.