రేపు కార్తీక పౌర్ణమి.. సీఐ సూచనలివే

రేపు కార్తీక పౌర్ణమి.. సీఐ సూచనలివే

ప్రకాశం: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని కనిగిరి సీఐ ఖాజావలి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో చెరువులు, వాగులు, నదులలో భారీగా నీరు వచ్చి చేరిందన్నారు. పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు, దీపాలు వెలిగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆలయాల వద్ద కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించాలన్నారు.