మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే
CTR: మాజీ సీఎం వైఎస్ జగన్ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించినట్లు చెప్పారు. పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించినట్టు వెల్లడించారు.