ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్
NGKL: జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆదివారం డీఎంహెచ్ రవికుమార్‌తో సమావేశమైన కలెక్టర్.. వారోత్సవాల కార్యాచరణపై చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.