జాతీయ రహదారి భూములపై అదనపు కలెక్టర్ విచారణ
JGL: జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామ పరిధిలోని నేషనల్ హైవే-63 వద్ద భూ సంబంధిత అంశాలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత విచారణ చేపట్టారు. ఈ మేరకు స్థలాన్ని, భూసమస్యలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. రైతులు, భూయజమానుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.